
చదువుకునేందుకు లండన్ వెళ్లి..
మేడిపల్లి: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసమని లండన్ వెళ్లిన ఆయన శుక్రవారం అర్ధరాత్రి చాతిలో నొప్పిగా ఉందని రూమ్‌మెట్స్‌కు చెప్పాడు. వెంటనే అపస్మారక స్థితికి చేరాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి పెద్ద కొడుకు. లండన్ నుంచి స్నేహితులు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా రమేశ్‌రెడ్డికి చేరవేయగా.. కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న విప్ ఆది శ్రీనివాస్ రమేశ్ రెడ్డిని ఓదార్చారు. శవాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని అధికారులకు సూచించారు.
గుండెపోటుతో దమ్మన్నపేట వాసి మృతి