
రుద్రంగిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, ప్రభుత్వ విప్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రంగిలో శనివారం విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేశ్, మండలాధ్యక్షుడు కర్ణవత్తుల వేణుకుమార్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఫ్లెక్సీలను తొలగించలేదన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, కాషాయ జెండాలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. రుద్రంగి మండల మాజీ అధ్యక్షుడు పడాల గణేశ్, బోయిని రాజు, పెద్ది శ్రావణ్, తదితురులు పాల్గొన్నారు.
సీఎం, ప్రభుత్వ విప్ ఫొటోలతో ఫ్లెక్సీలు
చోద్యం చూస్తున్న అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు