
గ్రీన్‌సిటీగా మార్చడమే లక్ష్యం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్‌ను గ్రీన్‌సిటీగా మార్చడమే లక్ష్యమని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో మరిన్ని మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్‌సిటీగా మార్చేందుకు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. యాదాద్రి, మియావాకీ, పట్టణ ప్రకృతి వనం, రాశివనాల పేరిట మొక్కలు పెంచుతున్నామన్నారు. నగరవాసులు తమ ఇంటి పరిసరాల్లో, ఖాళీ ప్రదేశాల్లో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు.
ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి
నగరంలోని ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని శాతవాహన యూనివర్సిటీ రోడ్డులోని ప్రజామరుగుదొడ్డిని, నైట్‌ఫుడ్ కోర్ట్, 38,39 వార్డు కార్యాలయాలను పరిశీలించారు. మరుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. నైట్‌ఫుడ్‌కోర్టు ప్రాంతంలో చెత్త లేకుండా చూడాలని అన్నారు. నైట్ ఫుడ్‌కోర్టులోని వ్యాపారులతో మాట్లాడి, సదుపాయాలు, సమస్యలపై ఆరా తీశారు. డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.