
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ సివిల్ ఆస్పత్రి ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలివేయనున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పంజాల శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఎస్‌వీజేసీ కళాశాల, రామాలయం, జానకి చికెన్‌సెంటర్, ప్రశాంత్‌నగర్‌కాలనీ, రెనె ఆస్పత్రి ప్రాంతాలు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని భవానీనగర్, జానకి స్ట్రీట్ అపార్ట్‌మెంట్స్, ఏఓస్ పార్కు, సప్తగిరికాలనీ, హెల్త్ సెంటర్ రోడ్, గ్రీన్ స్ట్రీట్, శ్రీనగర్‌కాలనీ, ఏఓస్‌కాలనీ, తాహెరామజీద్, సంతోషిమాత ఆలయ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.
చెర్లభూత్కూర్ సబ్‌స్టేషన్ పరిధిలో..
33/11 కేవీ చెర్లభూత్కూర్ సబ్‌స్టేషన్ పరిధిలో బ్రేకర్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చెర్లభూత్కూర్, చామన్‌పల్లి, ఫకీర్‌పేట, తాహెర్‌కొండాపూర్, దుబ్బపల్లి, జూబ్లీనగర్, బహద్దూర్‌ఖాన్‌పేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు పేర్కొన్నారు.