
చైన్‌స్నాచింగ్ ముఠా అరెస్ట్
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగలుగా మారి ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ ఠాణాలో సోమవారం సీఐ వివరాలు వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కునారం గ్రామానికి చెందిన దెవుల రాజమ్మ మేడలోంచి బంగారం చైన్‌ను ఈనెల అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో సోమవారం సుల్తానాబాద్ మండలం కనుకుల ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నింగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొత్తపల్లికి చెందిన యాకబ్, మహమ్మద్ పారుఖ్‌ఖాన్, షేక్‌బాశు, షేక్ సైదుగా తమ పేర్లు వెల్లడించారు. పోలీసు శైలిలో విచారణజరపగా.. ఒంటరి వృద్ధులు లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరు నేరాలు చేసేలా ప్రోత్సహించిన షేక్ షబ్బీర్, షేక్ బాబా, షేక్ మక్తుం ఆలీ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు.. బిందెలు, వంటపాత్రలు అమ్ముకునేందుకు మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, జనగామ, వరంగల్ జిల్లాల్లో డేరాలు వేసుకొని సమీప గ్రామాల్లో వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బులు సరిపోకపోగా జల్సాలు తీర్చుకునేందుకు అధికంగా డబ్బులు సంపాదించాలని నిర్టయించుకున్నారు. ఇలా చోరీలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 10 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. బసంత్‌నగర్, మంచిర్యాల, ముత్తారం, ధర్మారం, దండెపల్లి, కొడకండ్ల, పెద్దపల్లి, చెన్నూర్, ఎలిగేడ్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని వృద్ధుల మేడలోంచి గొలుసులు చోరీచేశార. చోరీచేసిన బంగారాన్ని షేక్ సైదు విక్రయించేవాడు. డబ్బులను అందరూ పంచుకొని జల్సాలు చేసేవారు. నిందితుల నుంచి రూ.3లక్షల నగదు, 10తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలు వెంకటేశ్, సనత్‌రెడ్డి, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు సదానందం, వెంకటేశ్, లక్ష్మణ్, స్వామి, శ్రీనివాస్‌ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు.
10 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన సీఐ సుబ్బారెడ్డి