
ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ఇందిర్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎండీ భరన్‌ఖాన్ గతంలో డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. కాగా గ్రామంలో నిర్మించిన 26 డబుల్ బెడ్‌రూమ్‌లను శనివారం కలెక్టర్ పంపిణీ చేయగా అందులో భరన్‌ఖాన్ పేరు తొలగించారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కాంగ్రెస్ నాయకులను, అధికారులను నిలదీశాడు. అక్కడితో ఆగకుండా ఆదివారం జిల్లెల్ల కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిని ఇంటి కోసం రూ.50వేలు డిమాండ్ చేశావంటూ నిలదీశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. తమ పార్టీ వారే మోసం చేశారని మనస్థాపానికి గురై పురుగులమందు డబ్బాతో చెరువు వద్దకు వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోబుతున్నానంటూ స్నేహితులకు వీడియోకాల్ చేశాడు. వారు వెంటనే అతడి భార్య రుబీనాకు తెలపగా.. ఆమె చెరువు వద్దకు పరుగెత్తి పురుగులమందు డబ్బాను లాగిపడేసింది. అతడిని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లింది. భరన్‌ఖాన్‌కు భార్య రుబీనా, ముగ్గురు కొడుకులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
రూ.50 వేలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు