
రాజన్నసేవలో ప్రముఖులు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామిని హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వచనాలతో ఆహ్వానించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోడెముక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్‌జాదవ్, వేములవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అర్ర ప్రవీణ్‌కుమార్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
జ్యోతిష్మతి విద్యార్థికి రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి కళాశాలలో సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతున్న కోగిల వారజ హైదరాబాద్‌లోని మల్టీ నేషనల్ కంపెనీలో పైథాన్ బ్యాకెండ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించింది. వార్షిక వేతనం రూ.12 లక్షలు ఉంటుందని చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. సాంకేతిక నైపుణ్యం, కళాశాల శిక్షణ ఫలితమని అన్నారు. జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలైన పైథాన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సాగర్‌రావుతోపాటు సెక్రటరీ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.అనిల్‌కుమార్, అకాడమిక్స్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతి డాక్టర్ ఆర్.జగదీషన్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

రాజన్నసేవలో ప్రముఖులు