
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.
బతుకుపోరులో ఆగిన గుండె
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
వ్యవసాయబావిలో పడి..
శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
నీటిగుంతలోపడి..
ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్‌పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి