
యూరియా కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం
గోదావరిఖని/ఫెర్టిలైజర్‌సిటీ: తెలంగాణ రాష్ట్రానికి యూరి యా కేటా యింపులో కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. ఈమేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఆయన ఒకలేఖ రాశారు. తెలంగాణకు అవసరమైన యూరియా మొత్తాన్ని కేటాయించకుండా, రాజకీయ ప్రేరణతో ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కోత విధిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆ యూరియా మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతేడాది 60 వేల టన్నుల యూరియా కేటాయించగా, ఈసారి కేవలం 30వేల టన్నులే కేటాయించి అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తి చేసిన యూరియా కూడా తెలంగాణకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గతేడాది స్థాయి లో యూరియా కేటాయింపులను వెంటనే పునరుద్ధరించాలని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తయారైన యూరి యాను తొలుత తెలంగాణకే కేటాయించాలని, రాజకీయ ప్రేరణకన్నా.. రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ