
చెరగని ముద్ర వైఎస్సార్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతిని డీసీసీ కార్యాలయంలో ఘనం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సారెస్పీ వరదకాలువ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన అభివృద్ధి ప్రదాత అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 56 మండలాలకు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ బ్యాంక్‌చైర్మన్ గడ్డం విలాస్‌రెడ్డి, నాయకులు ముల్కల ప్రవీణ్, వెన్న రాజ మల్లయ్య, పడిశెట్టి భూమయ్య, దిండిగాల మధు, చింతల కిషన్, వంగల విద్యాసాగర్, మాదాసు శ్రీనివాస్, మహిళా నాయకురాలు చెర్ల పద్మ పాల్గొన్నారు.
● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజశేఖరరెడ్డి జయంతి