
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● కలెక్టర్ పమేలా సత్పతి
మానకొండూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 35మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం అభినందనీయం అన్నారు. అ నంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. రెండోతరగతి విద్యార్థినిని ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠం చదివించారు. ఎంపీడీవో వరలక్ష్మి, తాహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంఈవో మధుసూదనాచారి పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రతీ ఇల్లు సందర్శించాలి
చొప్పదండి: కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా బూత్‌స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతీఇంటిని సందర్శించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా ఓటర్ల నమోదు, తొలగింపు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో రాజగోపాల్‌రెడ్డి, ఎలక్షన్ డీటీ మనోజ్ పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి చొప్పదండి, చిట్యాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేశారు.