
స్మార్ట్‌బిన్ దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి
● లోకాయుక్తను ఆశ్రయించిన సామాజిక కార్యకర్త
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్‌సిటీగా ఏర్పడిన తర్వాత చెత్త సేకరణకు అండర్‌గ్రౌండ్ స్మార్ట్‌బిన్‌లను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్‌బిన్‌ల ఏర్పాటుకు సుమారు రూ.1.07 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ స్మార్ట్ బిన్‌లను ఇన్‌స్టాల్ చేసే పని పూర్తికాకముందే మున్సిపల్ అధికారుల సహకారంలో సంబంధిత కాంట్రాక్టర్ బిల్లులు పొందారని సామాజిక కార్యకర్త ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్మార్ట్‌బిన్‌ల నిర్వహణ లేకపోవడంతో కేవలం కమిషన్లు పొందేందుకే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందని పే ర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన లోకా యుక్త ఈ విషయంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీడీఎంఏను ఆదేశించడంతో పాటు ఈ కేసును ఈనెల 24కు వాయిదా వేసింది.
ప్రభుత్వ భూముల్లో
ఆక్రమణలు తొలగించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, నగరపాలకసంస్థ రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఫుట్ పాత్, అక్రమ కట్టడాలు, తదితర అంశాలపై చర్చించారు. సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు అందించాలన్నారు. విలీన డివిజన్‌లలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా క్షేత్రస్థాయి సర్వే ద్వారా గుర్తించాలన్నారు. నగరంలో ఎక్కడ ఫుట్ పాత్, రోడ్డు ఆక్రమణలు ఉన్నా వెంటనే డీఆర్‌ఎఫ్ సాయంతో తొలగించాలని సూచించారు. రీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, నగరపాలక డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, ఇన్‌చార్జీ డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, తహసీల్దార్ రాజేశ్, టీపీఎస్‌లు తేజస్విని, సంధ్య, ఆర్‌వో భూమానందం పాల్గొన్నారు.
మెడికల్ రిప్‌ల సమ్మెకు ఐఎంఏ మద్దతు
కరీంనగర్‌టౌన్: రేపటి నుంచి(సోమవారం) నుంచి ప్రారంభించనున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్‌ల సార్వత్రిక సమ్మెకు కరీంనగర్ ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) మద్దతు తెలిపిందని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ కార్యదర్శి మిరుపాల అంజయ్య తెలిపారు. శనివారం ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎనమల్ల నరేశ్, డాక్టర్ నవీన్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ... నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు నియంత్రించి, ఔషధాలు , పరికరాలపై జీఎస్‌టీని ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రవేశాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ రిప్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హరీశ్, సహాయ కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు.
సమాజాన్ని చదివిన కవి భరద్వాజ
కరీంనగర్‌కల్చరల్: సమాజాన్ని చదివిన కవి రావూరి భరద్వాజ అని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర కొనియాడారు. శనివారం డాక్టర్ రావూరి భరద్వాజ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు మధ్యలో ఆపేసిన భరద్వాజ.. గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి రచయితగా ఎదిగారన్నారు. ప్రముఖ కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు రచన ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు భరద్వాజ అ న్నారు. లక్ష్మీగౌతం వందన, సయ్యద్ ము జాఫర్, చెన్న అనిల్‌కుమార్, అన్నవరం దేవేందర్, నాగభూషణం, అంజయ్య, తంగెడ అశోక్‌రావు, సురే్‌శ్ దామెరకుంట శంకరయ్య, ని ర్మల, పీఎస్ రవీంద్ర, గజేందర్‌రెడ్డి, ప్రభాకర్, జితేందర్, మహేందర్ రాజు తదితరులున్నారు.

స్మార్ట్‌బిన్ దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి