
యువకుడు అదృశ్యం
కరీంనగర్‌క్రైం: నగరంలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన ఒక యువకుడు అదృశ్యమైనట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన మర్రిబోయిన అనిల్(25) గత నెల 26న బయటకు వెళ్లివస్తానని చెప్పి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కోరుట్లరూరల్: పట్టణ శివారు అయోధ్యపట్నం ప్రాంతానికి చెందిన కొరిమె లక్ష్మణ్ (57) గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్ తన భార్య రాజవ్వ జాతీయ రహదారి పక్కన స్వీట్‌కార్న్ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంటికి వస్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం లక్ష్మణ్‌ను ఢీకొట్టి వెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. లక్ష్మణ్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టపగలు ఇంట్లో చోరీ
జమ్మికుంటరూరల్: జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. సైదాబాద్ గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ బుధవారం జమ్మికుంట వెళ్లాడు. అతని భార్య సుజాత ఇంటికి తాళంవేసి వనభోజనాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని రెండు తులాల బంగారం, 12తులాల వెండి, రూ.26వేల నగదు అపహరణకు గురయ్యాయి. టౌన్ సీఐ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
స్వగ్రామానికి చేరిన మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన రేవెళ్ల రవీందర్ (57) ఇటీవల గుండెపోటుతో ఇజ్రాయిల్‌లో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియల్లో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

యువకుడు అదృశ్యం