
దేదీప్యమానంగా కొలనూరు పాఠశాల
ఓదెల(పెద్దపల్లి): ‘నా వయసు 23 ఏళ్లు ఉన్నప్పుడు కొలనూరు పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చా. 14 భాషాలు నేర్చుకున్న. వివాహం చేసుకున్న. ఇప్పటికీ పాఠశాల దేదీప్యమానంగా ఉందిశ్రీ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కాలోజీ సాహిత్య పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ ప్రశంసించారు. ఓదెల మండలం కొలనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మన ఊరు.. మనబడి వేదికలో పూర్వవిద్యార్థులు సన్మాన మహోత్సవం నిర్వహించారు. నలిమెల భాస్కర్ మాట్లాడుతూ, కొలనూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే చదువుకున్నానని చెప్పారు. ప్రపంచంలో అతిసులువైనది చదువు అని, దానికికోసం విధ్యార్థులు శ్రమించాలన్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు, అప్పటి విద్యార్థులు, గ్రామస్తులు అందరూ తనకు ఆత్మీయులేనన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న వారు ప్రస్తుతం పెద్ద హోదాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అనంతరం చేపట్టిన సాంస్రృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నతానియల్, బాసిక్స్ సీఈవో దేవరకొండ సత్యనారాయణ, ఎంఈవో రమేశ్, ప్రధానోపాధ్యాయుడు ఏసుదాసు, మాజీ సర్పంచ్ సామ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్