ఆయిల్‌పాం తోటలో అగ్ని ప్రమాదం
ధర్మపురి: షార్ట్ సర్క్యూట్‌తో ఆయిల్‌పాం తోటలో మంటలంటుకొని సుమారు రూ.8 లక్షల విలువ గల వస్తువులు కాలిపోయిన ఘటన మండలంలోని కోస్నూర్‌పల్లెలో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. కోస్నూర్‌పల్లె మాజీ సర్పంచ్ ఎన్నం లక్ష్మారెడ్డి 3 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటను సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోటకు నీళ్లు పెట్టి ఇంటికి వెళ్లిన లక్ష్మారెడ్డి సాయంత్రం తోటలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకొని స్థానికులతో కలిసి మంటలు ఆర్పడానికి ఇబ్బందులుపడ్డారు. షార్ట్‌సర్క్యూట్‌తో డ్రిప్, పైపులైన్లు కొంతవరకు ఆయిల్‌పాం చెట్లు కాలిపోయాయని తెలిపాడు.
ఆయిల్‌పాం తోటలో అగ్ని ప్రమాదం


