నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: ఈ నెల 22న జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున, అధికార యంత్రాంగం సదరు పనుల్లో ఉంటారని పేర్కొన్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ప్రకటనలో వివరించారు. ఈ నెల 29నుంచి కార్యక్రమం యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని, సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు
కరీంనగర్‌టౌన్: ధనా ర్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ మాఫి యా రెచ్చిపోతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిలువునా దోచుకుంటున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రోగికి ఎంఎన్‌సీ మందులతో వైద్యం అందించాల్సిన వైద్యులు, లోకల్ మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. అనవసరమైన వైద్య పరీక్షలు చేసి, అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మందుల ధరలు ప్రైవేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలు నిర్ణయించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు ప్రైవేటు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. నాసిరకం మందులతో వైద్యం అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’లో పాల్గొన్న సుడా చైర్మన్
కరీంనగర్ కార్పొరేషన్: భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము శీతకాల విడిది సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు.
ఎన్నికల ఆర్‌వోపై వేటు?
చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తిలో ఈనెల 14న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించలేదని ఆర్‌వోపై వేటు వేసినట్లు తెలిసింది. ఇందుర్తిలో 12 వార్డులున్నాయి. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యుర్థులు గెలుపొందారు. సీపీఐ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. మొదట 10వ వార్డు సభ్యురాలు అందె స్వరూపను ఉపసర్పంచ్‌గా ఐదుగురు ఎన్నుకున్నారు. బీజేపీ వార్డు సభ్యులు తటస్థంగా ఉన్నారు. ఆర్వో రెండోసారి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించి, చింతపూల అనిల్ గెలిచినట్లు ధ్రువీక రించారని సర్పంచ్ నరేందర్, మిగితా వార్డు సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్‌వోను కలెక్టర్ స స్పెండ్ చేసినట్లు తెలిసింది. సస్పెన్షన్ ఉత్తర్వు లు రావాల్సిఉందని ఎంపీడీవో తెలిపారు.
నేటి ప్రజావాణి రద్దు


