‘సంజయ్ మాటలు అర్థరహితం’
కరీంనగర్ కార్పొరేషన్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం మాట్లాడు తూ యుద్ధంపై వాస్తవాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని దేశద్రోహి అనడమేమిటన్నారు. ఇందిరాగాంధీని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంటులో అన్ని బిల్లులకు మద్దతు తీసుకుని, బీఆర్‌ఎస్‌తో అవి నీతిలో భాగస్వాములై, ఇప్పుడు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, కుర్ర పోచయ్య, మ్యాకల నర్సయ్య, ఎట్టం వేణు పాల్గొన్నారు.
‘బీజేపీతో పొత్తు పెట్టుకునే కర్మ బీఆర్‌ఎస్‌కు లేదు’
కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ బా ధ్యతరహితంగా మాట్లాడటం, బీఆర్‌ఎస్, కేసీ ఆర్ కుటుంబంపై అబద్ధాలు ప్రచారం చేయ డం మానుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామక్రిష్ణారావు హితవు పలికారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ బీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి గల్లీ లీడర్‌గా వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ స్థాపించినప్పుడు హరీశ్‌రావు, కవిత, కేటీఆర్‌లు ఉన్నారని వారసత్వ రాజకీయాలు లేవని, వారంతా పునాది రాళ్లలాగా పనిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మునిగిపోయే నావ లాంటి బీజేపీలో తాము కలవబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. నాయకులు పొన్నం అనిల్‌గౌడ్, చీటి రాజేందర్‌రావు, శ్రీనివా స్‌గౌడ్, భాస్కర్, రవి, సంపత్, శే ఖర్, చారి, షౌకత్‌అలీ, వసంతరావు పాల్గొన్నారు.
జూనియర్ లెక్చరర్ల ఆందోళన
కరీంనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2023 మే 3న నియామకమైన సుమారు 3,200 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లు రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుపై నెలకొన్న అస్పష్టతతో తీవ్ర ఆందోళనలో ఉన్నారని లెక్చరర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి దేవేందర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం డీఐఈవో గంగాధర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయినప్పటికీ, రెండో ఇంక్రిమెంట్‌ను వేతన బిల్లుల్లో చేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. రెండో ఇంక్రిమెంట్ ప్రక్రియను వేగవంతం చే యాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ప్రధాన కార్యదర్శి హనుమాండ్ల శ్రీని వాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తినేని శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దేవయ్య రాజేశ్వర్ రావు, పెద్దపల్లి జిల్లా నుండి నరహరి, మహిళా కార్యదర్శి అరుణ, కంకణాల శ్రీనివాస్, నరసింహం, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ఆదేశాల కాపీని జత పరుస్తూ ప్రభుత్వానికి లేఖ పంపారు. రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల అభిమానుల చారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్ర మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బాబా య్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు పదివేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు రూ.17వేల జీతం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని, అమలు చేయాలని డిమాండ్ చేశారు.
‘సంజయ్ మాటలు అర్థరహితం’
‘సంజయ్ మాటలు అర్థరహితం’
‘సంజయ్ మాటలు అర్థరహితం’


