
పెళ్లి బరాత్‌కు వెళ్లి వస్తూ..
● అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ ● యువకుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
జగిత్యాలక్రైం: ముగ్గురు యువకులు స్నేహితుడి పెళ్లి బరాత్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇంకొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల పట్టణ శివారులోని గోవిందుపల్లికి చెందిన కొలగాని వెంకటేశ్ (18), విద్యానగర్‌కు చెందిన గడిల విఘ్నేశ్, చిలుకవాడకు చెందిన చెట్‌పల్లి అజయ్ బుధవారం ద్విచక్ర వాహనంపై బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్‌లో పాల్గొన్నారు. గురువారం వేకువజామున జగిత్యాలకు వస్తుండగా పట్టణంలోని నిజామాబాద్ రోడ్‌లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో కొలగాని వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. చెట్‌పల్లి అజయ్ పరిస్థితి విషమంగా ఉంది. గడిల విఘ్నేశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పట్టణ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం నడుపుతున్న గడిల విఘ్నేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మదరావు తెలిపారు.