వైద్య కళాశాలకు దేహదానం
ఓదెల/సుల్తానాబాద్(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన జీగురు ఓదెలు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి అప్పగించారు. తొలుత మృతుడి నివాసంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సమక్షంలో సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్, సుల్తానాబాద్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. మృతుడి కుమారులు జీగురు నాగయ్య, ఐలయ్య, రవీందర్, రాంచందర్ నేతృత్వంలో పార్థివదేహాన్ని ప్రతిమ మెడికల్ కాలేజీ నిర్వాహకులకు అప్పగించారు. మృతుడి భార్య జీగురు కనకలక్ష్మి సైతం గతంలో శరీరదానానికి అంగీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


