వైభవంగా చక్రస్నానం
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు వేద మంత్రాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. ఊరేగింపుగా తీసుకెళ్లి ధర్మగుండంలో పవిత్రస్నానం ఆచరించారు. రాత్రి 108 కలశాభిషేకాలతో పుష్పయాగం(నాఖబలి) అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు కడారి కుమారస్వామి, సురేందరెడ్డి, రవీందర్‌రెడ్డి, మోహన్ పాల్గొన్నారు.


