పింఛన్ ఇప్పించండి
కూతురు పుట్టుక నుంచి మానసిక, శారీరక వికలాంగురాలు. ఇప్పుడు 7 సంవత్సరాల వయ సు. దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. వస్తదంటరు.. కానీ రాదు. సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చిన. ఎన్నాళ్లని తిరగాలే. – వడ్లూరి రవళి, వెల్ది, మానకొండూరు
రెండేళ్లుగా అందని ‘ఉపకారం’..
బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో భాగంగా విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రభుత్వం లక్కీడ్రా ద్వారా పాఠశాలలకు విద్యార్థులను కేటాయిస్తున్నారు. కానీ.. స్కాలర్‌షిప్‌లు మాత్రం రావడం లేదు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.. అధికారులను కలవడం వినతిపత్రాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. – శేఖర్‌రావు, నందిని కాన్వెంట్ స్కూల్
పింఛన్ ఇప్పించండి


