ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్లగొల్లపల్లిలో గ్రాస్‌కట్టర్‌లో ఇరుక్కొని చేయి తెగిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన నిమ్మత్తుల మధుకర్‌రెడ్డి–రజిత దంపతుల పెద్ద కుమారుడు సుదర్శన్‌రెడ్డి(11) ఆదివారం సెలవు కావడంతో తన తాతతో కలిసి ఆవుల షెడ్డు వద్దకు వెళ్లాడు. ఆవుల కోసం పచ్చిగడ్డిని తన తాత కట్టర్‌లో వేస్తుండగా పక్కనే ఉన్న బాలుడు సైతం వేసేందుకు ప్రయత్నించగా చేయి ఇరుక్కుంది. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన తాత మిషన్‌ను ఆపివేసి బాలుడి చేతిని బయటకు తీశాడు. అయితే అప్పటికే మోచేతి కింది భాగం వరకు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మోచేతి వరకు తొలగించారు.