జూలపల్లి(పెద్దపల్లి): తెలుకుంట గ్రామానికి చెందిన వివాహిత మేకల పద్మ(48) శుక్రవారం రాత్రి పురుగులమందు తాగి, ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మేకల తిరుపతి, ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. తిరుపతి ఉపాధి కోసం 13ఏళ్ల క్రితం మలేషియా దేశానికి వెళ్లాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పట్నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. అయితే, నెలరోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా.. వైద్యులు మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా జ్వరం తగ్గలేదు. దీంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా టీబీ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. విదేశాలకు వెళ్లివచ్చి నందున మరికొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. పరీక్షలు చేయించుకోవాలని అతడి భార్య పద్మ కూడా అనేకసార్లు చెప్పినా నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన పద్మ ఇంట్లోని పురుగుల మందు తాగి, దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. మృతురాలి కూతురుకు వివాహం కాగా, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
భర్త వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదని మనోవేదన
తెలుకుంటలో వివాహిత ఆత్మహత్య