బయటి ఫుడ్ తినడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదాలున్నాయి. ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అయితే లివర్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. సకాలంలో గుర్తించి వైద్యం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన ఆహార పదార్థాలలు తినడం మంచిది.
– టీవీ రాజశేఖర్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని
తనిఖీల్లేకనే..
ఇటీవల ఓ బేకరీలో బ్రెడ్ కొన్నా. దానిపై తయారీ తేదీ, ఎకై ్స్పరీ డేట్, కంపెనీ పేరు లేవు. బేకరీపై నమ్మకంతో కొని, మరుసటి రోజు తినడానికి చూస్తే, బ్రేడ్ పీసుల్లో సిల్వర్ కవర్ ముక్కలు కనిపించాయి. బేకరీ నిర్వాహకులను నిలదీస్తే పొరపాటు జరిగిందని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని చెప్పి ఈజీగా తీసుకున్నారు. అధికారుల తనిఖీల్లేకనే ఇలా జరుగుతున్నాయి. నాకు జరిగిన అన్యాయంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తా.
– పిట్టల రాజ్‌కుమార్, గోదావరిఖని
చర్యలు తీసుకుంటాం
నాణ్యతాప్రమాణాలు పాటించని బేకరీలు, స్వీట్‌హౌజ్‌లను ఆకస్మికంగా తనిఖీలు చేయిస్తాం. నిబంధనలు పాటించనివాటిపై బాధితులు నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. బల్దియాకు వచ్చే ఫిర్యాదుల నేపథ్యంలో శానిటేషన్ విభాగం అధికారులు పలు హోటళ్లపై తనిఖీలు చేసి జరిమానా విధించారు.
– జె.అరుణశ్రీ, అదనపు కలెక్టర్
బయటి ఫుడ్‌తో ఇన్‌ఫెక్షన్లు
బయటి ఫుడ్‌తో ఇన్‌ఫెక్షన్లు