
‘ఎన్‌హెచ్–563’
ఊపందుకున్న
● కిలోమీటర్ రహదారి పనులకు రూ.37 కోట్లు ఖర్చు ● ఏడాదిలోగా వరంగల్–కరీంనగర్ సెక్షన్ అందుబాటులోకి.. ● కరీంనగర్–జగిత్యాల పనులకు రూ.2,227 కోట్లు ● 59 కి.మీ. మేర ఫోర్‌లేన్ రహదారి ● నిత్యం సమీక్షిస్తున్న కేంద్రమంత్రి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రను కలిపే జాతీయ రహదారి–563 పనుల్లో ముందడుగు పడనుంది. గతంలో ‘భారత్ మాలా పరియోజన’ కింద ప్రారంభించిన ఈ రహదారిని ప్రస్తుతం ‘మోదీ 100 రోజుల యాక్షన్‌ప్లాన్’ కిందికి మార్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 127 కి.మీ. మేర నిర్మాణం జరుగుతోంది. గతేడాది నుంచే కరీంనగర్–వరంగల్ సెక్షన్‌లో పనులు మొదలయ్యాయి. ఈ రెండు నగరాల మధ్య 68 కి.మీ. నిర్మిస్తున్న రహదారి పనులు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జూలై 16 నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు భావిస్తున్నారు. భూసేకరణలో చిన్నాచితక సమస్యలు మినహా ఎలాంటి అడ్డంకులు లేవు. గట్టుదుద్దెనపల్లి సమీపంలో టోల్‌గేట్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. మరోవైపు ఇరుకుల్ల వాగుపై వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్వర్టులు, మేజర్, మైనర్ జంక్షన్లు, బైపాస్ (మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి బైపాస్)లు నిర్మిస్తున్నారు.
2 వారాల్లో జగిత్యాల సెక్షన్‌లో టెండర్
కరీంనగర్–జగిత్యాల సెక్షన్‌లో 2 రెండు వా రాల్లో టెండర్ పనులు మొదలు కానున్నాయి. మొత్తం 58.8 కి.మీ. ఉన్న ఈ రహదారికి రూ.2,227 కోట్ల వరకు ఖర్చు కానున్నాయి. ప్రతీ కిలోమీటరుకు అధికారులు రూ.37 కోట్లు ఖర్చు(జీఎస్టీతో కలిపి) ఖర్చు చేయనున్నారు. రూ.2,227 కోట్లలో 241 హెక్టార్ల భూసేకరణకు రూ.387.15 కోట్లు కేటాయించారు. ఈ రహదారి నిర్మాణ అంచనా వ్యయం రూ.1,503.73 కోట్లు మాత్రమే. దీనికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకొని పై మొత్తానికి చేరింది. ఇవే కాకుండా, గంగాధర సమీపంలోని తుర్కాశీనగర్ పొలిమేరలో టోల్‌గేట్ నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు దాటాక ట్రక్కులు ఆగేందుకు ట్రక్ బే నిర్మించనున్నారు. అలాగే, జగిత్యాల సమీపంలో డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు రెస్ట్ ఏరియాను కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. ఆయా పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిత్యం సమీక్షిస్తున్నారు.
కరీంనగర్–జగిత్యాల సెక్షన్
దూరం : 58.8 కి.మీ.
అంచనా వ్యయం: రూ.2,227 కోట్లు
బ్రిడ్జిలు: 24 (18 మైనర్, 06 మేజర్)
ఆర్వోబీ/ఆర్‌యూబీ: 03
మేజర్ జంక్షన్లు: 27
మైనర్ జంక్షన్లు: 29
టోల్‌ప్లాజా: గంగాధర–తుర్కాశీనగర్
సమీపంలో
ట్రక్ బే: టోల్‌గేట్ సమీపంలో
రెస్ట్ ఏరియా: జగిత్యాల సమీపంలో
వరంగల్–కరీంనగర్ సెక్షన్
దూరం: 68 కి.మీ.
అంచనా వ్యయం: రూ.1,647 కోట్లు
గడువు తేదీ: 16–7–2025 (730 రోజులు)
మానకొండూరు బైపాస్: 9.44 కి.మీ.
తాడికల్ బైపాస్: 6.65 కి.మీ.
హుజురాబాద్ బైపాస్ : 15.05 కి.మీ.
ఎల్కతుర్తి బైపాస్ : 4.60 కి.మీ.
హసన్‌పర్తి బైపాస్: 9.57 కి.మీ.
మైనర్ జంక్షన్లు: 29
మాది చేతల ప్రభుత్వం
ప్రతీ కిలోమీటరుకు రూ.37 కోట్లు ఖర్చు చేయడం బీజేపీ, ప్రధాని మోదీ సర్కారు సంకల్పానికి నిదర్శనం. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. మేమెప్పుడూ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. ఇప్పటికే వీలైనంత తర్వగా టెండర్లు పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ఆదేశించాం. వచ్చే ఏడాది వరంగల్–కరీంనగర్ సెక్షన్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఫోర్ లేన్ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్

‘ఎన్‌హెచ్–563’

‘ఎన్‌హెచ్–563’

‘ఎన్‌హెచ్–563’