
నగదు చూపుతున్న కరీంనగర్ పోలీసులు
కరీంనగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కరీంనగర్ నగరంలోని వివిధ ఠాణాల పరిధిలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. రూ.15.82 లక్షలు పట్టుకున్నట్లు తెలిపారు. బడింది. వారి వివరాల ప్రకారం.. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని రాజీవ్ చౌక్‌లో కరీంనగర్ దుర్గమ్మగడ్డకు చెందిన జనగం సుమన్ కల్యాణ్ వద్ద రూ.7 లక్షలు, కరీంనగర్ టూ టౌన్ పరిధిలోని గీతాభవన్ చౌరస్తా వద్ద మానకొండూర్‌కు చెందిన నెల్లి భాస్కర్ వద్ద రూ.1,11,900, ఐబీ చౌరస్తా వద్ద కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన కోల ప్రదీప్‌కుమార్ వద్ద రూ.5,70,900, కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో కట్టారాంపూర్‌కు చెందిన గాండ్ల సురేశ్ వద్ద రూ.2 లక్షలు స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు.
వేములవాడలో రూ.5.67 లక్షలు..
వేములవాడ: పట్టణ పరిధిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం శుక్రవారం ఓ వ్యక్తి వద్ద రూ.5.67 లక్షలు పట్టుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడన్నారు. కానీ, సంబంధిత ఆధారాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అందజేశామన్నారు. ఏఈఈ వెంకటరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ భిక్షపతి, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులున్నారు.
అంతర్ జిల్లా చెక్‌పోస్టు వద్ద రూ.93 వేలు..
మెట్‌పల్లిరూరల్: బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ సమీపంలోని అంతర్‌జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో తరలిస్తున్న రూ.93 వేలను పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. సంబంధిత ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి, జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామన్నారు.
రాయపట్నం చెక్‌పోస్టు వద్ద రూ.2 లక్షలు..
ధర్మపురి: రాయపట్నం చెక్‌పోస్టు వద్ద రూ.2 లక్షలు పట్టుకున్నట్లు ధర్మపురి పోలీసులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయపట్నం వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా నగదు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం డబ్బులను సంబంధిత అధికారులకు పంపించినట్లు తెలిపారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వేములవాడలో..
Comments
Please login to add a commentAdd a comment