
మాట్లాడుతున్న వెంకట్‌రెడ్డి
చిగురుమామిడి: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం చిగురుమామిడి మండలంలోని రేకొండ పరిధి పెద్దమ్మపల్లెలో ఆయన ఓటు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలను ఓటర్లు చమరగీతం పాడబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలవబోతున్నారని పేర్కొన్నారు. హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏ గ్రామంలో చూసినా ఎక్కువ మంది ఓటర్లుచేతి గుర్తుకు మొగ్గు చూపారన్నారు. సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు చాడ శ్రీధర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి