
ధర్నా చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులు
కరీంనగర్: 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్‌పీ)ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ చౌక్‌లో ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీకాంత్ మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనైతికమని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ బిల్లు కేవలం అగ్రవర్ణాల మహిళల కోసం మాత్రమే తయారు చేశారని విమర్శించారు. 93శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తగినంత రిజర్వేషన్ కేటాయిస్తూ బిల్లును సవరించాలని డిమాండ్ చేశారు. నాయకులు నరేశ్, రాకేశ్, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, శ్రీనివాస్, లక్ష్మణ్, రాజు, శివాజీ, రవికిరణ్, మార్వాడి సుదర్శన్ పాల్గొన్నారు.
ఉద్యాన పట్టుపరిశ్రమ డీడీగా ప్రతాప్
కరీంనగర్ అర్బన్: జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ ఇన్‌చార్జి డీడీగా ప్రతాప్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. డీడీ బండారి శ్రీనివాస్ సెలవులో వెళ్లగా త్వరలోనే అతనికి పదోన్నతి రా నున్నట్లు సమాచారం. ఇక అతను జిల్లాకు రావడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో జగిత్యాల ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి ప్రతాప్‌సింగ్‌ను జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. గతంలో జిల్లాలో ఉద్యానశాఖలో ఏడీఎంగా విధులు నిర్వహించగా జిల్లాపై పూర్తి పట్టుంది.