● రైతుల డిమాండ్
● మత్తమాల సొసైటీ ఎదుట ఆందోళన
వ్యవసాయ అధికారులకు సమస్యను విన్నవిస్తున్న రైతులు
ఎల్లారెడ్డి : స్మార్ట్ ఫోన్‌లేని తాము యూరియాను ఎ లా బుక్ చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా అందించా లని డిమాండ్ చేస్తూ మంగళవారం మత్తమాల సొ సైటీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. శివాన గర్, బ్రాహ్మణపల్లి, జంగమాయిపల్లి, మత్తమాల, అల్మాజీపూర్, మల్కాపూర్, రుద్రారం గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తమాల సొసైటీకి మంగళవారం 440 బస్తాల యూరియా వచ్చింది. యాప్‌లో బుక్ చేసుకున్న రైతులు బస్తాలను తీసుకువెళ్లడానికి రాగా.. సొసైటీ పరిధిలోని గ్రామాల రై తులు ఆందోళనకు దిగారు. యాప్‌లో బుక్ చేసుకోకున్నా తమకు ముందు పంపిణీ చేశాకే ఇతరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు సర్దిచెప్పి నా రైతులు వినలేదు. అనంతరం పోలీసులు వచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం సొసైటీ సిబ్బంది యాప్ ద్వారా యూరియా బుక్ చే సుకున్న రైతులకు బస్తాలు అందించారు.


