గురుకులాలకు 27 మంది విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

గురుకులాలకు 27 మంది విద్యార్థుల ఎంపిక

Mar 28 2026 7:23 AM | Updated on Mar 28 2026 7:23 AM

సింగిల్‌ఫేజ్‌ మోటార్లతో నీటి సరఫరా పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

దోమకొండ: దోమకొండ ఫోర్ట్‌ అండ్‌ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది 5వ తరగతి ప్రవేశాల గురుకుల పరీక్ష కోసం 33 మందికి కోచింగ్‌ ఇవ్వగా వారిలో 27 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో ఎంపికై నట్లు గడికోట ట్రస్టు మేనేజర్‌ బాబ్జీ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చామన్నారు. గురుకులాలకు ఎంపికై న విద్యార్థులను సన్మానించారు. గడికోట ట్రస్టు ప్రతినిధులు రాజశేఖర్‌, బండారి ఆనంద్‌, గణేష్‌ యాదవ్‌, వినయ్‌ తదితరులున్నారు.

బాన్సువాడ రూరల్‌: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండటానికి సింగిల్‌ఫేజ్‌ మోటార్ల ద్వారా కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇబ్రహీంపేట్‌ సర్పంచ్‌ ఉద్దెర సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం 7వ వార్డులో పంచాయతీ సిబ్బందితో కుళాయి ఏర్పాటు చేయించామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని ఆమె కోరారు. నాయకులు రాజ్‌కుమార్‌, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మొగులాన్‌పల్లి తండాలో మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. నెలలు గడిచినా మురికి కాలువలు శుభ్రం చేయించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు వృద్ధి చెందుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతోంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు సమయంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయించాలని తండావాసులు కోరుతున్నారు.

కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని బడాకసాబ్‌ గల్లీ వద్ద రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోగా, శుక్రవారం ఉదయం రైలుపట్టాలపై మృతదేహంను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వయస్సు 50–55ఏళ్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement