నూతన కార్యవర్గం.. | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం..

Mar 28 2026 7:23 AM | Updated on Mar 28 2026 7:23 AM

బీజేపీ రాజంపేట నూతన కార్యవర్గం..

రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలు కార్యకర్తలు సమావేశమై నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుర్రాల రాము, ప్రధానకార్యదర్శిగా కొత్తిమీర్‌కర్‌ వంశీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రెండోసా రి ఎన్నికై న గుర్రాల రాము మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కామారెడ్డి ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపే తం చేస్తానన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, నేతలు పిట్ల శ్రీనివాస్‌, గంగారెడ్డి పాల్గొన్నారు.

యాడారం బీజేపీ కార్యవర్గం..

బీబీపేట: యాడారం గ్రామంలో బీజేపీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం మండలాధ్యక్షుడు అల్లం ప్రవీణ్‌ అధ్యక్షతన ఎన్నుకున్నారు. బీజేపీ గ్రామాధ్యక్షుడిగా పిడుగు కిశోర్‌, ప్రధాన కార్యదర్శిగా పోసానిపల్లి రవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నక్క రవీందర్‌, కుమార్‌, శ్రీనివాస్‌, ధర్మారెడ్డి, భరత్‌ రాజు, మధు, రమేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

మజీద్‌ నూతన కమిటీ..

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద పట్టణంలోని ఆబెదీన్‌ మజీద్‌ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సయ్యద్‌ మోయిజ్‌, ఉపాధ్యక్షులుగా షేక్‌ హుస్సేన్‌, షేక్‌ జలాల్‌, నదీం బబ్లు, ప్రధాన కార్యదర్శిగా బాబుమియా, ట్రెజరీగా నిస్సార్‌, నజీర్‌ పటేల్‌, సలహాదారులుగా మోయినొద్దిన్‌, అబ్దుల్‌ వహీద్‌, షేక్‌ ఉస్మాన్‌లను ఎన్నుకున్నారు. పాత కమిటీ గత 10 ఏళ్లు కొనసాగింది. నూతన కమిటీతో పాటు పెద్దల సూచనలతో మజీద్‌ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అధ్యక్షుడు సయ్యద్‌ మోయిజ్‌ అన్నారు. గ్రామ పెద్దలు మొయినోద్దిన్‌, సయ్యద్‌ నజీర్‌, ఇమాం మౌలాన షేక్‌ రిజ్వాన్‌ ఖాస్మీ, అబ్దుల్‌ గఫార్‌, అబ్రార్‌అలీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు సందాని, ముజాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement