గడికోటలో క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గడికోటలో క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Mar 28 2026 7:23 AM | Updated on Mar 28 2026 7:23 AM

భూదాత కుమారులకు సన్మానం

దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో శుక్రవారం క్రికెట్‌ పోటీలు నిర్వహించగా.. మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌ ప్రారంభించారు. దోమకొండతో పాటు కామారెడ్డికి చెందిన జూనియర్‌ స్థాయి క్రికెట్‌ పోటీలు జరిగినట్లు ఆయన తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో మెలగాలని వారికి సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముదాం రవి, కామారెడ్డి, దోమకొండకు చెందిన క్రికెట్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటకు చెందిన పౌడాల కిషన్‌ 30 ఏళ్ల క్రితం మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఎకరం స్థలంతోపాటు తన ఇంటిని గ్రామానికి విరాళంగా ఇచ్చారు. దీంతో శ్రీరామనవమి సందర్భంగా కిషన్‌ కుమారులు రమేష్‌, ప్రవీణ్‌కుమార్‌ను శుక్రవారం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు కిషన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్తులు నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్‌ గూలపల్లి లక్ష్మి, నాయకులు నారాయణ, శ్రీను, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement