జీపీ పెండింగ్‌ బిల్లులు చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

జీపీ పెండింగ్‌ బిల్లులు చెల్లించండి

Mar 26 2026 7:29 AM | Updated on Mar 26 2026 7:29 AM

బిచ్కుంద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీమా షెట్కార్‌కు పంచాయతీ కార్యదర్శుల వినతి

చెల్లించాల్సిన బిల్లులు రూ.3.5 లక్షలు

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరుతూ కార్యదర్శులు బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సీమ షెట్కార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ.. గోపన్‌పల్లి, దౌల్తాపూర్‌, కందర్‌పల్లి మూడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారని, జీపీల ప్రత్యేక అధికారుల పాలనలో జీపీలో నిధులు లేకపోవడంతో కార్యదర్శులు సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించారని అన్నారు. చేసిన పనుల తీర్మానం కాపీలు, బకాయిలు ఉన్నాయని, ఫర్నిచర్‌, రికార్డులు పూర్తి నివేదిక మున్సిపల్‌ అధికారులకు అప్పట్లో అప్పగించామని చెప్పారు. మూడు జీపీలకు సుమారు రూ.3.5 లక్షలు బకాయిలు రావాల్సి ఉందన్నారు.

బకాయిలు చెల్లించడానికి కృషి: చైర్‌పర్సన్‌

మూడు జీపీల బకాయి బిల్లులు గురించి కలెక్టర్‌తో మాట్లాడి చెల్లించడానికి తనవంతు కృషి చేస్తానని చైర్‌పర్సన్‌ సీమ షెట్కార్‌ కార్యదర్శులకు భరోసా కల్పించారు. కమిషనర్‌ ఖయ్యుంతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఎంబీ రికార్డు ఉన్న వాటికి ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తాయని ఎంబీ లేని వాటికి రావని కమిషనర్‌ తెలిపారు. ట్రాక్టర్ల ఈఎంఐలు, బ్యాంకుకు చెల్లించిన కిస్తీలు, విద్యుత్‌ బల్బులు, బోరు మరమ్మతులకు ఎంబీ రికార్డులు ఉండవని.. బకాయిలు ఉన్నాయని జీపీ రికార్డులు అప్పగించేటప్పుడు బల్దియా అధికారులకు వివరాలు ఇచ్చామని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement