దోమకొండ: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద విద్యుత్ స్తంభాలు తొలగించాలని దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య కోరారు. బుధవారం వి ద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లపై నుంచి వెళ్లే కరెంటు తీగలను అక్కడి నుంచి తీసివేయాలని కోరారు.మండల కేంద్రంలో ఇండ్ల నిర్మా ణం చేస్తున్న చోట విద్యుత్ వైర్లు ఇళ్లపై నుంచి ఉ న్నందున నూతనంగా ఇళ్ల నిర్మాణం చేసేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని వెంటనే అక్కడినుండి తీసివేయాలని సూచించారు. వేసవికాలంలో ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
డంపింగ్‌యార్డు నిర్వహణకు రూ.50 లక్షల మంజూరు
దోమకొండ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి డంపింగ్ యార్డ్ నిర్వహణకు డీఆర్‌డీవో స్వచ్ఛ్ భారత్ నుంచి రూ.40 లక్షలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సహకారంతో మరో రూ.10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. అలాగే దోమకొండ గడికోట ట్రస్ట్ నిర్వాహకులు కామినేని అనిల్‌కుమార్ సైతం గ్రామంలో విద్యుత్తు సరఫరా నిర్వహణకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్‌కో ఏఈ విజయ్‌భాస్కర్, సిబ్బంది సురేష్, నవీన్, సంపత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌లున్నారు.


