పదో తరగతి విద్యార్థికి పాముకాటు | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థికి పాముకాటు

Mar 25 2026 7:29 AM | Updated on Mar 25 2026 7:29 AM

సరంపల్లి ఎస్టీ గురుకుల

పాఠశాలలో ఘటన

కామారెడ్డి జీజీహెచ్‌లో చికిత్స

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్ర శివారులోని సరంపల్లి ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి పాముకాటు కు గురవ్వడం కలకలం రేపింది. వెంటనే విద్యార్థిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు త రలించారు. ఈ ఘటనతో తోటి విద్యార్థులంతా భయాందోళనకు గురవుతున్నా రు. వివరాలు ఇలా.. గాంధారి మండలం జెమిని తండాకు చెందిన బానోత్‌ చరణ్‌ సరంపల్లి ట్రైబల్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళ వారం ఉదయం అతడు పాఠశాల గ్రౌండ్‌లోకి రాగా, ఎడమ కాలిపై పాము కాటు వేసింది. విద్యార్థి కేకలు వేయడంతో అప్ర మత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అ తడిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి (జీజీహెచ్‌) తరలించారు. చరణ్‌ ఆ రోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యు లు తెలిపారు. పరీక్షల సమయంలో ఈ ఘటన జరగడంతో తోటి విద్యార్థులు తీ వ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉ న్నతాధికారులు స్పందించి హాస్టళ్లలో పా రిశుధ్య పనులు చేపట్టి, విద్యార్థుల రక్ష ణకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement