బాన్సువాడ: పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తుపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యపై ఎంఈవో నాగేశ్వర్‌రావుతో మాట్లాడారు. ఆయన వెంట టౌన్ సీఐ శ్రీధర్, ఎంఈవో నాగేశ్వర్‌రావు, ప్రధానోపాధ్యాయులు నరహరి తదితరులున్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో కూలీల శాతాన్ని పెంచాలని పీడీ సురేందర్ సూచించారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్‌కార్డులు లేనివారికి జాబ్ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. కొలతల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో సవితారెడ్డి, ఏపీవో తిరుపతి, టెక్నికల్ అసిస్టెంటులు కృష్ణగౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6 కోట్ల 2 లక్షల బడ్జెట్‌ను రూపొందించారు. కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్లు గాయత్రి, మహేశ్వరి, కౌసరున్నీసా, మంజుల, చంద్రయ్య, గఫార్, సిద్ధి శ్రీధర్, తిరుపతి, దశరథం, మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, మేనేజర్ వాసంతి తదితరులున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి):లింగంపల్లి పాఠశాల లో కోతుల బెడద నుంచి రక్షించుకోవడానికి ఆ వరణ చుట్టూ సోలార్ కంచె ఏర్పాటు పనుల ను సోమవారం సర్పంచ్ లావణ్య ప్రారంభించారు.ఉప సర్పంచ్ ఎడ్ల గంగారాం,వార్డు స భ్యులు శ్రీకాంత్, నందకుమార్, గంగయ్య, ప ద్మ,సౌమ్య,జ్యోతి,హెచ్‌ఎం రమాదేవి, పంచా యతీ కార్యదర్శి ప్రకాశ్, జీపీవో నవీన్‌కుమార్, సైట్ ఇంజనీర్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.


