బాన్సువాడ రూరల్: ఒక్క సిలిండర్ గ్యాస్‌ను రెండుగా, రెండు సిలిండర్ల గ్యాస్‌ను మూడు సిలిండర్లలోకి మార్చుతున్న బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. సోమవారం నిజాంసాగర్‌కు చెందిన వీరభద్ర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఆటోలో కొంతమంది బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఓ ప్రత్యేక పరికరం ద్వారా ఒక సిలిండర్ గ్యాస్‌ను రెండింటిలోకి మారుస్తూ కనిపించారు. అలా మార్చిన సిలిండర్లను బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తుండటాన్ని స్థానికులు గమనించడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. కాగా, ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఆటోను వేగంగా నడిపి ఓ టీవీఎస్ ఎక్సెల్‌ను ఢీకొట్టారు. అనంతరం ఆటోను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 16 సిలిండర్లతో కూడిన ఆటోను స్వాధీ నం చేసుకున్నారు.
ఒక్క సిలిండర్‌ను రెండుగా
మార్చుతున్న వైనం
ఆటో వదిలి పారిపోయిన దుండగులు
ఆటో, 16 సిలిండర్లు స్వాధీనం
చేసుకున్న పోలీసులు


