తల‘సిరి’ లేదు! | - | Sakshi
Sakshi News home page

తల‘సిరి’ లేదు!

Mar 23 2026 8:48 AM | Updated on Mar 23 2026 8:48 AM

తల‘సిరి’ లేదు!

ఇంటింటికీ ఆహార భద్రత!

రాష్ట్రంలో సగటు పౌరుడి తలసరి ఆదాయం పెరిగినా.. జిల్లా మాత్రం వెనకబడే ఉంది. తలసరి ఆదాయంలో 27వ స్థానంలో ఉన్న కామారెడ్డి.. జీడీడీపీలో మాత్రం 17వ స్థానంలో ఉంది. తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగినా కామారెడ్డి జిల్లా మాత్రం అట్టడుగునే ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక–2006 ప్రకారం కామారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 2,63,307 గా నమోదయ్యింది. ఈ విషయంలో రాష్ట్రంలో 27 వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీడీడీపీ) విషయంలో మాత్రం జిల్లా స్థానం కాస్త మెరుగ్గా ఉంది. రూ. 30,296 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 326 పరిశ్రమల ద్వారా 10,448 మంది ఉపాధి పొందుతున్నారు. మానూఫ్యాక్చరింగ్‌ యూనిట్లు 5,696, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 25,331 ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

వన మహోత్సవంలో నంబర్‌వన్‌..

జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 17.99 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2024–25 సంవత్సరంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో 123.6 శాతంతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

‘ఉపాధి’లో ఎనిమిదో స్థానం...

ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 సంవత్సరంలో 22.2 లక్షల పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కా గా.. 15.4 లక్షల పనిదినాలను కల్పించారు. పనులు కల్పించడంలో జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది.

జిల్లాలో 579 రేషన్‌ దుకాణాలు ఉండగా, 2,94,479 కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 17,815 కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన కార్డులు, 2,75,839 ఆహా ర భద్రతాకార్డులు, 825 అన్నయోజన కార్డులు ఉన్నాయి. జిల్లా లో 3 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ ఉద్యోగులుపోనూ దాదాపు మిగతా అన్ని కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

వ్యక్తిగత ఆదాయంలో

అట్టడుగున జిల్లా

రాష్ట్రంలో 27వ స్థానం...

జీడీడీపీలో 17వ

స్థానంలో కామారెడ్డి

తెలంగాణ సామాజిక,

ఆర్థిక సర్వేలో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement