● తరలివచ్చిన నిరుద్యోగులు
● 325 మంది
ఉద్యోగాలకు ఎంపిక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో ఆదివారం జీసీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. సుమారు 3,500 మంది యువతీ యువకులు ఈ మేళాకు తరలివచ్చారు. ఐటీ, ఫార్మా, మెడికల్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. అభ్యర్థుల అర్హతలను బట్టి ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి, 325 మందికి అక్కడికక్కడే ఉద్యోగ అవకాశం కల్పించి నియామక పత్రాలను అందజేశారు.
ఉపాధి అవకాశాలు కల్పించేందుకే..
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందన్నారు. ఉద్యోగాలకు ఎంపికై నవారు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేళాలో ఉద్యోగాలు పొందినవారు జీసీఆర్ ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణహరి, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జూలూరి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమిది మహేష్, రాంశెట్టి హర్షిత, కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, శంకర్‌రావ్, చాట్ల వంశి, ప్రసాద్, జమిల్, రవీందర్ గౌడ్, రంగ రమేశ్‌గౌడ్, నర్సోళ్ల మహేశ్, బల్ల శ్రీనివాస్, నిరంజన్, మెహర్ బాబా తదితరులు పాల్గొన్నారు.


