ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ ఎమ్మెల్యేను కలిసిన సర్పంచులు ఆత్మ కమిటీ చైర్మన్‌గా దశరథ్‌నాయక్‌ ఎలుగు బంట్ల సంచారం ఎల్‌పీజీ సిలిండర్లు స్వాధీనం

లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్‌లో మంగళవారం ప్రజావాణి ఫిర్యాదుపై ఎంపీవో మలహరి విచారణ చేశారు. అయిలాపూర్‌లో గ్రంథాలయం కోసం నిర్మించిన భవనంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలులేకుండా పోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయాన్ని తొలగించి గ్రంథాలయానికి కేటాయించాలని గ్రామానికి చెందిన మన్నె కృష్ణ ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీవో గ్రామంలో విచారణ చేపట్టారు. నిరుద్యోగులు చదువుకోవడానికి వీలుగా తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముందుకు రావడంతో ఫిర్యాదుదారుడు అంగీకరించినట్లు తెలిపారు. సర్పంచ్‌ రాజయ్య, ఉపసర్పంచ్‌ సంజీవులు, కార్యదర్శి నవాజ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును కలిశారు. సర్పంచుల ఫోరం ఎంపిక అనంతరం మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్పంచ్‌ల ఫోరం ఎన్నికల్లో సక్రూనాయక్‌ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేతలు సాయిరాం, బాబు, సేవ్యానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేట తండాకు చెందిన దశరథ్‌నాయక్‌ను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆత్మ కమిటీ చైర్మన్‌తో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి 24 మంది డైరెక్టర్‌లను నియమించారు. నూతనంగా ఎంపికై న చైర్మన్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సన్మానించారు.

నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే

మదన్‌మోహన్‌రావు రాక

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డికి నేడు ఎమ్మెల్యే మ దన్‌మోహన్‌రావు రానున్నట్లు మున్సిపల్‌ చైర్మ న్‌ పద్మ శ్రీకాంత్‌ మంగళవారం తెలిపారు. మై నార్టీలకు ఇచ్చే ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందు కు ఎమ్మెల్యే హాజరుకానున్నట్లు తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం తెల్గాపూర్‌ శివారులో మంగళవారం సాయంత్రం ఎలుగు బంట్లు సంచరించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఎలుగుబంట్ల సంచార దృశ్యాలను యువకులు వీడియోలు తీశారు. యాసంగి ఆరుతడి, వరిపంటలు సాగు చేసిన రైతులు రేగడి చేను వద్దకు కాపలా వెళ్లగా రెండు ఎలుగు బంట్లు గాండ్రిస్తూ పరుగులు తీస్తుండగా మంచెలపైకి ఎక్కి అరుస్తూ ప్రాణాలు కాపాడుకున్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బాన్సువాడ రూరల్‌: మండల కేంద్రంలోని వివిధ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, క్యాంటీన్లలో మంగళవారం సివిల్‌ సప్లయ్‌, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి 9 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వ్యాపార అవసరాలకు కమర్షియల్‌ సిలిండర్లు మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement