ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

Mar 18 2026 7:46 AM | Updated on Mar 18 2026 7:46 AM

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఉగాది ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గోపాల్‌పేటలో ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు జరుగనున్న ఉగా ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉ త్సవాలలో భాగంగా చేపట్టనున్న ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అల్లర్లు జరగకుండా సర్పంచ్‌లు, ఉ పసర్పంచ్‌లు, గ్రామపెద్దలు బాధ్యత వహించాలన్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌, సర్పంచులు పాల్గొన్నారు.

దోమకొండ: ఉగాది పండుగ సందర్భంగా నిర్వ హించే ఎడ్లబండ్ల ప్రదర్శన శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై ప్రభాకర్‌ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో స ర్పంచ్‌ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరె డ్డి, నాయకులు శంకర్‌రెడ్డి, సీతారాం మధు, మా ర్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement