చైన్‌స్నాచర్‌ను వెంబడించి పట్టుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్‌ను వెంబడించి పట్టుకున్న పోలీసులు

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

చైన్‌స్నాచర్‌ను వెంబడించి పట్టుకున్న పోలీసులు

కామారెడ్డి క్రైం: మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని పారిపోతున్న ఓ చైన్‌స్నాచర్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్స్‌ మధు, కళ్యాణ్‌లు స్టేషన్‌రోడ్‌లో విధుల్లో ఉన్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతుడు చైన్‌ లాక్కొని పరారయ్యే ప్రయత్నం చేశారు. సమీపంలో ఉన్న ఇద్దరు బ్లూకోల్ట్స్‌ సిబ్బంది వెంటనే స్పందించి అతడిని వెంబడించారు. కొద్ది దూరం వెళ్లేలోగా చైన్‌స్నాచర్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందిఽతుడిని వద్ద నుంచి 3 తులాల బంగారం గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. కానిస్టేబుల్స్‌ మధు, కళ్యాణ్‌లను పట్టణ హెస్‌హెచ్‌వో నరహరి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement