నిర్లక్ష్యం నీడన అతిథి గృహం
నిజాంసాగర్(జుక్కల్): ప్రజాప్రతినిధులు, అధికారుల విడిది కోసం రూ.కోటి వెచ్చించి నిర్మించిన అతిథి గృహం నిరుపయోగంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే రెండేళ్లుగా నిరుపయోగంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజాంసాగర్ మండల కేంద్రంలో గెస్ట్ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. రెండేళ్ల కిందట గెస్ట్ హౌస్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. అయితే నాటి నుంచి భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. ఫర్నిచర్ ఇతర సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించలేదు. భవన సముదాయం ఆవరణలో బోరుబావి తవ్వి, మోటార్‌ను ఏర్పాటు చేయగా, స్థానిక కాలనీవాసులు వాడుకుంటున్నారు.
● నిరుపయోగంగా మారి రెండేళ్లు
● పట్టించుకోని అధికారులు
నిర్లక్ష్యం నీడన అతిథి గృహం


