రాజీ మార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గమే రాజమార్గం

Dec 22 2025 2:03 AM | Updated on Dec 22 2025 2:03 AM

రాజీ

రాజీ మార్గమే రాజమార్గం

బాన్సువాడ: రాజీ మార్గమే రాజమార్గమని బాన్సువాడ కోర్టు జడ్జి టీఎస్‌పీ భార్గవి అన్నారు. ఆదివారం బాన్సువాడ కోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులు అందరూ లోక్‌ అదాలత్‌లో రాజీ పడి కేసులు పరిష్కరించుకోవాలని, కేసుల పరిష్కరం ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. రాజీతో ఇరువర్గాలు గెలిచినట్లేనని, సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకు కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయవాదులు ఖలీల్‌, మొగులయ్య, కోర్టు సిబ్బంది ఉన్నారు.

ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్‌ కోర్టులో ఆదివారం ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి సుష్మ రాజీ చేసుకోదగ్గ కేసులకు సంబంధించిన వాటిని పరిష్కరించినట్లు వారు తెలిపారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి పోలీస్‌ స్టేషన్లతో పాటు ఎకై ్సజ్‌ శాఖకు సంబంధించి రాజీపడ దగిన కేసులను న్యాయమూర్తి పరిష్కరించినట్లు వారు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గోపాల్‌రావు, న్యాయవాదులు పండరి, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, నవీద్‌, సాయిబాబా, సాయిప్రకాష్‌ దేశ్‌పాండే, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి ఎస్సైలు మహేష్‌, దీపక్‌కుమార్‌, భార్గవ్‌గౌడ్‌, ఆంజనేయులు, ఎకై ్సజ్‌ సీఐ షాకీర్‌ అహ్మద్‌ తదితరులున్నారు.

బిచ్కుందలో 295 కేసుల పరిష్కారం

బిచ్కుంద(జుక్కల్‌): బిచ్కుంద జూనియర్‌ సివిల్‌ కోర్డులో ఆదివారం లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించారు. జడ్జి వినిల్‌ కుమార్‌ ముందు ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకుంటామని ఒప్పుకోవడంతో 295 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి వినిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆవేశాలకు లోనుకాకుండా చిన్నచిన్న తగాదాలకు కొట్లాడుకోవద్దు.. ఏదైనా సమస్యలు ఉంటే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆవేశంలో కేసులు నమోదు చేసుకొని ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని అన్నారు.

రాజీ మార్గమే రాజమార్గం 1
1/2

రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం 2
2/2

రాజీ మార్గమే రాజమార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement