పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పిట్లం(జుక్కల్)/భిక్కనూరు/పెర్కిట్/కామారెడ్డి అర్బన్: పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1992–95 బ్యాచ్ చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత విద్యార్థులంతా మళ్లీ ఒకేచోట చేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యా యంగా పలకరించుకొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను సన్మానించారు. అలాగే భిక్కనూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1989–90 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్‌ఎ స్‌లో 2009–10 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఆర్మూర్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 1997–2000 బ్యాచ్ డిగ్రీ వి ద్యార్థులు సైతం ఆత్మీయసమ్మేళనంనిర్వహించారు.


