క్రైం కార్నర్
మాక్లూర్: మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ స్నేహ (24)అనే వివాహిత కొంత కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈక్రమంలో ఆమె జీవితంపై విరక్తి చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్థానికులు గమనించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే భర్త ఘటన స్థలానికి చేరుకొని, అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త సుమన్, మూడేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలోగల ఎర్రకుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామంలోని చెరువులో ఆదివారం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడు 5అడుగుల 4 అంగులాల ఎత్తు ఉన్నాడని, తెలుపునలుపు వెంట్రుకలు ఉన్నాయని, నలుపురంగు ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


