షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండలంలో ని పెద్ద శక్కర్గాలో షార్ట్‌సర్క్యూట్‌తో కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం అయింది. వివరాలు ఇ లా.. గ్రామానికి చెందిన జంగం శివప్ప కొన్ని రోజు ల క్రితమే కొత్తగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి అతడు తన ఇంటి ముందు కారును పార్క్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో కా రులో మంటలు అంటుకున్నాయి. వెంటనే మద్నూ ర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయిందని బాధితుడు శివప్ప వాపోయాడు. ఈ ఘటనపై పొలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు.


