లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ : బాన్సువాడ కోర్టులో ఆదివారం నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు అన్నారు. శనివారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వారు మాట్లాడు తూ కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. రాజీపడటానికి ఇరుపక్షాల వారికి సదావకాశమన్నారు. సమావేశంలో వలంటీర్లు రామకృష్ణరెడ్డి, అయ్యాల సంతోష్, అహ్మద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ బాక్స్‌లను అధికారులు మండల పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌బాక్స్‌లను గ్రామాల నుంచి తీసుకొచ్చి మండల పరిషత్ కార్యాలయంలోని ఓ గదిలో భద్రపర్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని ప్రత్యేకవాహనంలో జిల్లా కేంద్రానికి తరలించారు.
జాతీయస్థాయి శిక్షణ
పొందిన ఉపాధ్యాయుడు
కామారెడ్డి టౌన్: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ నూతన విద్యా విధానం శిక్షణ తరగతులకు జిల్లాకు చెందిన బానాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రవికుమార్ హాజరయ్యారు. రాష్ట్ర నుంచి కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యామని, 20 రోజులపాటు శిక్షణ పొందిన తమకు ధ్రువపత్రాలు అందజేశారని రవికుమార్ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు వివరిస్తామన్నారు.
భిక్కనూరు: సీనియర్ విద్యార్థులు జూనియర్‌లతో స్నేహ పూర్వకంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి అన్నారు. సౌత్‌క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, విద్యార్థుల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి జీవితం అమూల్యమైనదని దానిని సక్రమైన మార్గంలో ఉపయోగించుకుంటే భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. అధ్యాపకులతో గౌరవభావంతో మెలగాలని అన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సత్ససంబంధాలు ఉన్నప్పుడే యునివర్సిటీ అభివృద్ధి చెందడంతోపాటు విద్యార్థుల విజయాలు సాధ్యమవుతాయన్నారు. సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు అంజయ్య, హరిత, హాస్టల్ వార్డెన్ సునీత, ఏపీఆర్‌వో పిట్ల సునీత తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి


