‘మీ డబ్బు, మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: ‘మీ డబ్బు, మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన, సేవల శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల సెటిల్‌మెంట్ కోసం కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘మీ డబ్బు మీ హక్కు‘ అనే నినాదంతో జరుగుతున్న ఈ ప్రచారం ద్వారా, పౌరులు తమకు చెందాల్సిన క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు తదితర ఆర్థిక ఆస్తులను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు. ఆర్థిక ఆస్తులపై హక్కు కలిగిన వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించాలన్నారు. అనంతరం శిబిరంలో పాల్గొన్న సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించా యి. ఈ సందర్భంగా నిజమైన హక్కుదారులకు సెటిల్‌మెంట్ లెటర్లు సైతం జారీ చేశారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం ప్రవీణ్‌కుమార్,ఆయా బ్యాంకుల ప్రతినిధులు అనుపమ, మనీష్ సైనీ, వ రప్రసాద్, ఎల్డీఎం చంద్రశేఖర్ తదితరులు న్నారు.
రహదారుల భద్రత మాసోత్సవాలను
విజయవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ఈ నెల 22 నుంచి నిర్వహించనున్న జాతీయ రహదారుల భద్రత మాసోత్సవాలు – 2026ను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా మాట్లాడి భద్రత మాసోత్సవాలపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. రోడ్డు భద్రతను మెరుగుపర్చడం, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ నియమాల అమలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, తక్షణ సవరణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి నెల 4న రోడ్ సేఫ్టీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.


