విద్య రంగానికే ప్రాధాన్యత
● విద్యార్థులు భవిష్యత్‌లో
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
● వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ : నియోజకవర్గంలో విద్య రంగానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.27 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశామని, పేద విద్యార్థుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు ఆయన వివరించారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులను నిర్మించినట్లు ఆయన అన్నారు.
విశ్రాంత ఉద్యోగులకు ఘనంగా సన్మానం..
పెన్షనర్ల దినోత్సవం పురస్కరించుకుని బాన్సువాడలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. పట్టణంలో విశ్రాంత ఉద్యోగులకు తాను భవనం సమకూర్చి నిధులు మంజురు చేసినట్లు పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాసగార్డెన్‌లో అధికారికంగా నిర్వహించిన క్రిస్‌మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, విశ్రాంత ఉద్యోగులు పరిగె మోహాన్‌రెడ్డి, హన్మండ్లు, రఘురాం, శివరాజులు, కాశీనాథ్, వెంకటి, శ్రీనివాస్, కమ్మరి అనసూయ, వెంకటేశం తదితరులు ఉన్నారు.


